Home / SriPada Srivallabha Charitamrutam
Showing posts with label SriPada Srivallabha Charitamrutam. Show all posts
Showing posts with label SriPada Srivallabha Charitamrutam. Show all posts
sripada srivallabha charitamrutam chapter - 3 | శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము-3 | sripada.co
sripada sripada srivallabha SriPada Srivallabha Charitamrutam sripadacharitamrutam శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము-3శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము-3
శంకరభట్టునకు పళనిస్వామి దర్శనం, కురువపుర సందర్శనం
శ్రీపాద శ్రీవల్లభ స్మరణ మహిమ
శ్రీపాద శ్రీవల్లభుల దయవలన నేను విచిత్రపురం నుండి బయలుదేరితిని. నా మనస్సు చిదంబరము నందలి పరమేశ్వరుని దర్శించుటకు ఉవ్విళ్లూరుచుండెను. మూడురోజులు ప్రయాణము ఆనందకరముగా జరిగెను. నాకు అయాచితముగా భోజనము లభించుచుండెను. నాలుగవ దినమున ఒక గ్రామమునందు ఒక బ్రాహ్మణ గృహద్వారమున నిలబడి భిక్ష యాచించితిని. లోపలి నుండి మహా రౌద్రాకారముతో గృహ యజమాని భార్య వచ్చి అన్నమూ లేదు, సున్నమూ లేదు, అని కసురుకొనెను. నేను గృహము బైటనే కొంతసేపు వేచి యుంటిని. గృహ యజమాని బయటకు వచ్చి, "అయ్యా! అతిథి అభ్యాగతి సేవలకు నేను నోచుకొనలేదు. నా భార్య పరమగయ్యాళి. ఆమెకు కోపము వచ్చిన యెడల నా నెత్తి మీద కుండలను పగులగొట్టును. ఈ విషయమున మాత్రము మా గురుదేవుల ధర్మపత్నియు, యీమెయు సమానము. అయితే నా భార్య మాత్రము తను పగులగొట్టిన కుండల యొక్క మూల్యమును తెమ్మని నన్ను బాధించును.మా గురుదేవుల ధర్మపత్ని మాత్రము భాండమూల్యమును తెమ్మని బాధింపదు. ఇప్పుడే నా నెత్తిమీద కుండలు పగులగొట్టబడినవి. మా యింట అన్నోదకములకు లోటు లేదు. నేను భాండమూల్యమును మాత్రము విధిగా సత్వరమే చెల్లింపవలెను. అది నాకు సంకటముగా ఉన్నది. ఈ రోజున సంభావన దొరకు అవకాశమున్న యెడల ఇబ్బంది ఉండదు. లేని యెడల ఎవరి దగ్గరో అప్పో సొప్పో చేయవలెను. తిరిగి సంభావనలు దొరికినప్పుడు ఆ అప్పు తీర్చవలెను. నేను సంభావనలో దొరికిన ద్రవ్యములో కొంత భాగమును అప్పులు తీర్చుటకు వినియోగించి, మిగిలిన భాగమును ఆమెకు ఇచ్చుచుందును.
ఈ పధ్ధతి కొంతకాలము వరకు సాగెను. ఈ మధ్యన సంభావనలో దొరకు యావత్తు ద్రవ్యమును ఆమెయే తీసుకోనుచుండెను. అందువలన అప్పు తీర్చుటకు దారి కనబడుటలేదు. నా పరిస్థితి తెలిసినవారు ఎవ్వరునూ అప్పు ఇచ్చుటకు ముందుకు వచ్చుట లేదు. లోకులు 'నీకు అప్పు యిచ్చిన యెడల ఏ విధముగా తీర్చెదవు? మున్ముందు సంభావనలు వచ్చునపుడు తీర్చెదమనుకొందువా? ఆ దారియును యిప్పుడు మూసుకొని పోయెను.' అని అనుచుండిరి. స్థితిపరుడనయిన నాకు ఎవ్వరునూ దానము కూడా చేయుటలేదు. పైగా ఎగతాళి చేయుచుండిరి. ఇప్పుడు నేను భాండమూల్యమును చెల్లింపవలెను. నా భార్య నిన్ను కసురుకొనిన పిదప నన్ను లోనికి పిలచి, 'వీధిలో ఒక తీర్థయాత్రికుడు ఉన్నాడు. నీవు అతనితో పోయి ఎచ్చటయినా ఎవరయినా దానమిచ్చిన యెడల తీసుకురావలసినది. అప్పుడు మాత్రమే యింటిలో నీకు అన్నము లభించును.' అని అన్నది. అంతట భార్యా విధేయుడనై నేను నీతో బయలుదేరి వచ్చెదను. ఈ గ్రామములోని బ్రాహ్మణ్యము యొక్క గృహములన్నియును నాకు బాగుగా తెలియును. మనకు భోజనముతో పాటు దక్షిణ రూపమున కూడా ధనము లభించవచ్చును." అని ఆ బ్రాహ్మణుడు పలికెను. నేను నివ్వెరపోతిని. శ్రీపాదా! శ్రీవల్లభా! ఏమి యీ విషమ పరీక్ష! అనుకోని ఆ బ్రాహ్మణునితో కలిసి ఆ అగ్రహారములోని ప్రతి గృహస్థు యింటికిని పోయితిని. ధనసహాయము మాట అటుంచి ఒక్కరునూ పట్టెడు అన్నమును పెట్టువారే కరువయిరి. నాతో వచ్చిన బ్రాహ్మణుడు యిట్లు పలికెను. "అయ్యా! ఇప్పటివరకు నేను మాత్రమే దురదృష్టవంతుడను. నాతో కలియుట వలన నీ అదృష్టము కూడా హరించి నీకు కూడా దురదృష్టవంతుడవయితివి." అప్పుడు నేను యిట్లంటిని. "అయ్యా! సమస్త జీవులకును ఆహారమును సమకూర్చువాడు సర్వసమర్థుడైన శ్రీదత్త ప్రభువే! వారు ఈ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామరూపములతో కురువపురమున ఉన్నారు. నేను వారి దర్శనార్థమే పోవుచుంటిని. వారి నామస్మరణ చేసుకొనుచూ ఆ కనిపించుచున్న రావిచెట్టు మొదటలో కూర్చొనెదము. ఆపైన శ్రీదత్త ప్రభుని అనుగ్రహము". అని పలికితిని.
దానికి ఆ బ్రాహ్మణుడు వల్లెయనెను. కడుపులో ఆకలి దహించుచున్నది. నీరసముతో కూడిన స్వరముతో శ్రీపాద శ్రీవల్లభుల నామస్మరణము చేయుచుంటిని. నామస్మరణ కొనసాగుచుండగా విచిత్రపుర రాజభటులు మా వద్దకు వచ్చి, "అయ్యా! యువరాజుల వారికి మాట వచ్చినది. మూగతనము పోయినది. సత్వరమే మిమ్ములను తీసుకొని రమ్మని రాజాజ్ఞ అయినది. అందుచేత మీరు వెంటనే మాతో రావలసినదని" విన్నవించిరి. మా దురవస్థను రాజభటులకు చెప్పక నేనిట్లంటిని. "నేను ఒంటరిగా రాజాలను. నాతోపాటు యీ బ్రాహ్మణుని కూడా తీసుకుని వెళ్లవలెనని చెప్పితిని." దానికి రాజభటులు వల్లెయనిరి. మమ్ములను గుఱ్ఱములపై కూర్చుండబెట్టుకొని సగౌరవముగా తీసుకొని పోవుటను అగ్రహారీకులందరు గమనించి ముక్కుమీద వ్రేలు వేసికొనిరి.
మహారాజు ఇట్లు పలికెను. "అయ్యా! మహాత్మా! మీరు మహాపండితులని తెలిసి కూడా మిమ్ము సత్కరించకుండగా వట్టి చేతులతో పంపించితిమి. మీరు వెళ్ళిన తదుపరి యువరాజు స్పృహ తప్పి పడిపోయెను. అనేక ఉపచారములను చేసితిమి. చాలా సేపటికి కనులు తెరచి శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా! శ్రీదత్త దేవా దిగంబరా! అని పలుకసాగెను. యువరాజునకు ఆజానుబాహుడు, అత్యంత సుందరాకారుడయిన 16 సంవత్సరముల యతి దర్శనమిచ్చి, నోటిలో విభూతిని వేసెనని యువరాజుల వారు చెప్పిరి. ఆ యతి ఎవరు? ఎచ్చటనుందురు? శ్రీదత్తప్రభువులకును, ఆ యోగికిని గల సంబంధమేమి?" దయ ఉంచి తెలుపవలసినదని కోరెను.
"శ్రీపాదుల శ్రీపాదుకా మహిమను నేనేమి వర్ణించగలను? వారు సాక్షాత్తు దత్త ప్రభువుల అవతారము. శ్రీకృష్ణావతారము వలె అత్యంత విశిష్టమైన అవతార స్వరూపము వారిది. వారిని గూర్చి నేను విన్నది కూడా స్వల్పము మాత్రమే! వారిని దర్శించుకొను నిమిత్తమే నేను కురువపురమునకు పోవుచుంటిని. మధ్యలో గల పుణ్యస్థలములను, పుణ్యపురుషులను దర్శించుకొనుచుంటిని." అని సవినయముగా పలికితిని.
విచిత్రపురము నందలి పండితులు కూడా ఈ విచిత్ర సంఘటనకు ఆశ్చర్యపోయిరి. తమ మండల దీక్ష ఫలితముగా, రాజునకు సద్బుద్ధి ఏర్పడి, తమకు విమోచనము కలుగుటయే గాక యువరాజునకు మూగతనము పోయినందులకు వారు వేనోళ్ళ శ్రీవల్లభస్వామిని కీర్తించిరి.
రాజు నన్ను స్వర్ణదానముతో సత్కరించెను. రాజగురువు ఇట్లనెను. "అయ్యా! యిన్ని రోజులకు మాకు జ్ఞానోదయమైనది. శైవులు విష్ణుదూషణ చేయుట వలననూ, వైష్ణవులు శివదూషణ చేయుట వలననూ పాపము మూటగట్టుకొనుట తప్ప మరేమీ ప్రయోజనము లేదని గ్రహించితిమి. మా దైవదూషణలకు ప్రతిఫలముగా కష్టములను అనుభవించితిమి. తెలిసో తెలియకో మా మాధవ నంబూద్రి పుణ్యమా అని దత్తప్రభుని మండల దీక్షలో నుంటిమి. మీకు మేమెంతయునూ ఋణపడి యున్నాము." అని పలికెను.
మేము వారి నుండి శెలవు పుచ్చుకుని వచ్చునపుడు మాధవనంబూద్రి కూడా మాతో పాటు వచ్చెదనని పట్టుబట్టెను. మేము సరేనంటిమి. మేము ముగ్గురమూ అగ్రహారము చేరితిమి. రాజు మాకు దానముగా యిచ్చిన స్వర్ణమును అగ్రహార బ్రాహ్మణ్యమునకు యిచ్చితిని. అతని గయ్యాళి భార్య స్వర్ణమును గ్రహించిన తదుపరి మాకు భోజనము పెట్టెను. తదుపరి ఆమె కూడా శ్రీపాద శ్రీవల్లభుల భక్తురాలిగా మారెను. మునుపటి గయ్యాళితనము పోయి ఆమె సాధువర్తనురాలాయెను.
నేనూ, మాధవ నంబూద్రి కలిసి చిదంబరం వైపునాకు ప్రయాణము సాగించితిమి. ధర్మశాస్త అయ్యప్పదేవుని పూజార్థము గోదావరి మండలాంతర్గతమగు ర్యాలి గ్రామ నివాసులయిన పరబ్రహ్మశాస్త్రిని అగస్త్య మహర్షి తీసుకొని వెళ్ళెను. కాలక్రమమున గర్తపురీ(గుంటూరు) మండలాంతర్గతమైన నంబూరు గ్రామము నందలి వేదపండితులులను, మళయాళదేశము నేలు రాజవంశమువారు ఆహ్వానించగా చాలామంది బ్రాహ్మణులు నంబూరు విడిచి మళయాళదేశము చేరి వేదవిద్యను ప్రకాశింపజేసిరి. వారినే నంబూద్రి బ్రాహ్మణులని వ్యవహరించుట కద్దు. ఆదిశంకరుల వారి పూర్వీకులు కూడా నంబూరు అగ్రహారీకులే! నంబూద్రి బ్రాహ్మణులు ఆచార వ్యవహారములలోను, నియమ నిష్టలలోను, మంత్ర తంత్ర యంత్ర విద్యలలోను చాల ప్రసిద్ధులు. అయితే మాధవనంబూద్రి మాత్రము నిరక్షర కుక్షి. బ్రాహ్మణ గృహముల వంట జేసుకొని జీవించుచుండెను. పసితనముననే తల్లిదండ్రులను పోగొట్టుకొనెను. అయినవారు ఆదరింపరైరి. దత్తప్రభువునందు అతడు అచంచల భక్తి కలవాడు. శ్రీపాద శ్రీవల్లభుల అవతారమును గురించి విన్న మీదట వారిని ఎప్పుడు దర్శించెదనా యని తహతహలాడుచున్నాడు.
మేము చిదంబరం దాపులలో సిద్ధ మహాత్ములు ఒకరున్నారని విని, కొండకోనలలో ఏకాంతముగా ఉన్న వృద్ధ తపస్వి అయిన శ్రీ పళనిస్వామి వారిని దర్శించితిమి. మేము గుహ ద్వారమునకు వచ్చినప్పటికి శ్రీ పళనిస్వామి మమ్ములను చూచి, "మాధవశంకరులు యిద్దరూ కలిసి వచ్చుచున్నారే ? ఏమి భాగ్యము!" అని పలికెను. మేము మా పరిచయమును తెలుపకుండగనే మమ్ము పేరుతో పిలువగల వీరు సిద్ధ పురుషులని గ్రహించితిమి. కరుణాంతరంగులయిన శ్రీస్వామి "నాయనా! శ్రీపాద శ్రీవల్లభుల వారి ఆజ్ఞానుసారము నేను దేహమును త్యజించి వేరొక యవ్వనవంతమైన దేహములోనికి ప్రవేశించు సమయము ఆసన్నమైనది. ప్రస్తుత ఈ శరీరము యొక్క వయస్సు 300 సంవత్సరములు. శిథిలమైన ఈ దేహమును త్యజించి నూతన శరీరములో మరొక 300 సంవత్సరములు ఉండవలెనని శ్రీపాదుల వారి ఆజ్ఞ. జీవన్ముక్తులయిన వారు, జనన మరణ రూప సృష్టిక్రమమును దాటిన వారు కూడా శ్రీపాదుల వారు తిరిగి రమ్మని ఆజ్ఞాపించిన వచ్చి తీరవలసినదే ! సమస్త సృష్టిని నడిపించు మహాసంకల్పమే శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించినది. వారి అవతరణము ఉన్నతములయిన సూక్ష్మ లోకములలో ఎల్లప్పుడూ జరుగుచునే యుండును. నరరూపధారియై వచ్చుట సకృత్తు. వారిది యోగ సంపూర్ణ అవతారము. వారి అంశావతారములు ఎల్లపుడునూ యీ భూమి మీద భక్తి రక్షనర్థము అవతరించుచునే యుండును. నాయనా! శంకరా! నీవు విచిత్ర పురమున కాణాద మహర్షి గురించి వారి కాన సిద్ధాంతమును గురించి వచించితివే, కాస్త వివరింపుము." అని పలికిరి.
కాణాద మహర్షి కణ సిద్ధాంతము
కాణాద మహర్షి
"స్వామీ! నన్ను క్షమింపుడు. కాణాదమహర్షి గురించి, వారి కణసిద్ధాంతము గురించి నాకు తెలిసినది బహు స్వల్పము. నేను వచించినది కూడా అప్రయత్నముగా నా నోట పలికించబడినదని స్వామికి తెలియని విషయము కాదు." అని అంటిని.
కరుణాస్వరూపులైన శ్రీ పలనిస్వామి యిట్లు వచించిరి. సమస్త సృష్టియును కూడా పరమములయిన అణువులచే నిర్మింపబడినది. అటువంటి పరమాణువుల కంటే కూడా సూక్ష్మమైన కణముల ఉనికి వలన విద్యుల్లతలు ఉద్భవించును. సూర్యుని చుట్టూ కేంద్ర బిన్డువుననుసరించి మహా వేగములతో తమ తమ కక్ష్యలలో పరిభ్రమించుచుండును. ఇటువంటి సూక్ష్మ కణముల కంటెను సూక్ష్మమైన స్థితిలో ప్రాణుల యొక్క సమస్త భావోద్వేగాముల స్పందనలు ఉండును. స్పందనశీలమైన యీ జగత్తులో ఏదీ స్థిరముగా ఉండజాలదు. చంచలత్వమే దీని స్వభావము. క్షనక్షము మార్పులు చెందుటయే దీని స్వభావము. ఈ స్పందనల కంటెను కూడా సూక్ష్మ స్థితిలో దత్త ప్రభువుల వారి చైతన్యముండును. వారి అనుగ్రహము పొందుట ఎంత సులభాసధ్యమో అంత కష్ట సాధ్యము కూడా. ప్రతీ కణమును అనంత భాగములుగా విభజిస్తూ పోయిన యెడల ఒక్కొక్క కణ భాగము శూన్య సమానమగుచుండెను. అనంతములైన మహా శూన్యముల సంయోగ ఫలితమే యీ చరాచర సృష్టి, పదార్థము సృష్టి అయినట్లే పూర్తిగా దీనికి భిన్నమైన వ్యతిరేక పదార్థము కూడా ఉందును. ఇవి రెండునూ కలిసినపుడు వ్యతిరేకపదార్థము నశించును. పదార్థము తన గుణగణములను మార్పు చేసుకొనును. అర్చావతారములలో ప్రాణ ప్రతిష్ట జరిగినపుడు ఆ విగ్రహమూర్తులు చైతన్యవంతముగనే యుండి భక్తుల మనోభీష్టములను తీర్చుటకు సమర్థ వంతమగును. సర్వమంత్రములును కుండలిని యందే కలుగును. దాని యందే గాయత్రీ కూడా కలిగినది. గాయత్రి మంత్రము నందు మూడు పాదములు కలవని అందరూ భావింతురు. అయితే గాయత్రీ మంత్రము నందలి నాలుగవ పాదము 'పరోరజసి సావదోమ్' అని ఉన్నది. చతుష్పాద గాయత్రి నిర్గుణ బ్రహ్మమును సూచించునది అయి ఉన్నది. కుండలినీశక్తి 24 తత్త్వములలో యీ జగత్తులు సృష్టి చేయును. గాయత్రీ యందు కూడా 24 అక్షరములు కలవు. 24 అను సంఖ్యకు గోకులము అని కూడా పేరు కలదు.'గో' అనగా 2. కులము అనగా 4 . బ్రహ్మస్వరూపము మార్పులకు అతీతము కనుక తొమ్మిది సంఖ్యచే సూచితము. ఎనిమిది అనునది మహామాయా స్వరూపము. శ్రీపాద శ్రీవల్లభులు తనకు యిష్టమైన వారి నుండి "దో చౌపాతీ దేవ్ లక్ష్మీ" అని అనుచుండెడివారు. జీవులందరికీ పాటి స్వరూపము పరబ్రహ్మమే కనుక పతిదేవ్ అనునది తొమ్మిది సంఖ్యను, లక్ష్మీ అనునది ఎనిమిది సంఖ్యను, 'దో' అనునది రెండు సంఖ్యను 'చౌ' అనునది నాలుగు సంఖ్యను సూచించునవి అయి ఉన్నవి. 'దో చపాతీ దేవ్ లక్ష్మీ' అనుటకు మారుగా అపభ్రంశముగా, విచిత్రముగా 'దో చౌపాతీ దేవ్ లక్ష్మీ' అని పిలుచుచూ 2498 సంఖ్యను జీవులకు గుర్తుచేయు చుండిరి. గోకులము నందలి పరబ్రహ్మము, పరాశక్తి శ్రీపాద శ్రీవల్లభ రూపముననే ఉన్నవి. శ్రీ కృష్ణ పరమాత్మయే శ్రీవల్లభులని తెలియుము. గాయత్రీ మంత్ర స్వరూపము వారి నిర్గుణ పాదుకలని గుర్తించెదము.
శ్రీపాద శ్రీవల్లభ నిర్గుణ పాదుకలు
"నాయనా! శంకరా! స్థూల మానవ శరీరము నందు 12 రకముల భేదములు కలవు. అందరికినీ అనుభవైక వేద్యమగు స్థూల శరీరము స్థూల సూర్యుని ప్రభావమునకు లోనగునది. ఒకదాని కంటెను మరియొకటి సూక్ష్మ స్పందనలతో కూడిన శరీరములు ద్వాదశాదిత్యుల ప్రభావమునకు లోనగుచుండును.అయితే శ్రీవల్లభులు ద్వాదశ ఆదిత్యుల కంటెను కూడా అతీతమైన వారు గనుక వారి యొక్క దివ్య స్థూల శరీరము చిత్ర విచిత్రములైన దివ్య స్పందనలను కలిగి ఉండును.
మానవ శరీరముతో శ్రీ పీఠికాపురమున అవతరించుటకు ముందే అనగా 108 సంవత్సరములకు ముందే శ్రీవల్లభులు యీ ప్రదేశమునకు విచ్చేసిరి. నన్ను అనుగ్రహించిరి. ఇప్పుడు కురువపురమున ఏ రూపముతో నున్నారో అదే రూపముతో వారు యిచ్చతకు విచ్చేసిరి. వారి దివ్యలీలలకు అంతెక్కడిది? శ్రీవల్లభులు యిచ్చతకు విచ్చేసిన తదుపరి కొంతసేపటికి హిమాలయమునందలి మహాయోగులు బదరీ మహాక్షేత్రములో శ్రీ బదరీ నారాయణుని బ్రహ్మకమలములతో పూజించిరి. ఆ బ్రహ్మకమలము లన్నియు ఇచ్చట శ్రీ చరణముల కదా పడుచుండుట గమనించితిని. వారు దేశ కాలములకు అతీతులు." అని వచించెను.
నేను శ్రీ పళని స్వామి వారి దివ్య వచనములతో అనిర్వచనీయ అనుభూతిని పొందితిని. "స్వామీ! బ్రహ్మ కమలములనగా నేమి? అవి ఎచ్చట లభించును? వానిచే పూజించిన శ్రీదత్త ప్రభువు సంప్రీతులగుదురని మీ వచనముల వలన తెలియుచున్నది. దయచేసి నా సందేహము తీర్చగోరెదను." అని కోరితిని.
బ్రహ్మ కమలముల స్వరూపము
దానికి శ్రీ పళనిస్వామి కరుణాపూరిత దృష్టిని ప్రసరించుచూ యిట్లు తెలియజేసిరి, "శ్రీమహావిష్ణువు సదాశివుని బ్రహ్మకమలములతో పూజించెను. శ్రీ మహావిష్ణువు యొక్క నాభీకమలముగా చెప్పబడినది కూడా బ్రహ్మకమలమే. కమలములతో శ్రీదత్తుని అర్చించిన ఐహికాముష్మిక ఐశ్వర్యము సిద్ధించును. దివ్య లోకములందలి బ్రహ్మ కమలములకు ప్రతిగా యీ భూమండలము నందలి హిమాలయములందు యీ బ్రహ్మకమలములు కాననగును. సుమారు 12 వేల అడుగుల ఎత్తులో హిమాలయములందు సంవత్సరమునకు ఒకే ఒకసారి మాత్రమే యిది పుష్పించును. నాయనా! అర్థరాత్రి సమయము నందు మాత్రమే యిది వికసించుట మరియొక విచిత్రము. ఇది వికాసము చెండునపుడు అద్భుతమైన పరిమళము ఆ ప్రాంతమంతయును నిండిపోవును. హిమాలయమునందలి సాధకులయిన మహాత్ములందరూ యీ అద్భుత దర్శనమునకు రోజుల తరబడి, నెలల తరబడి నిరీక్షింతురు. శరత్కాలము నుండి వసంతకాలము వరకు యిది హిమములో కూరుకుపోయి ఉండును. చైత్రమాస ప్రారంభములో యిది హిమము నుండి బయటపడును. గ్రీష్మ కాలమంతయూ వికాసప్రక్రియ జరుగుచుండును. అమరనాధ్ నందలి అమరేశ్వర హిమలింగ దర్శనమగు శ్రావణ శుద్ధ పూర్ణిమా ప్రాంతము నందు అర్థరాత్రి సమయమందు యిది పూర్ణ వికాసము చెందును. నాయనా! శంకరా! సాధకులు, మహా తపస్వులు , సిద్ధ పురుషుల కోసము మాత్రమే కేవలము హిమాలయములందు మాత్రమే యీ అద్భుత లీల ఇప్పటికినీ, ఎప్పటికినీ జరుగుచుండును. బ్రహ్మకమలము యొక్క దర్శనము వలన సమస్త పాపములు నశించును. యోగ విఘ్నములంతరించును. ఇది సద్యః ఫలితము నిచ్చు అద్భుతలీల. కావున యోగులు, తపస్వులు వారి వారి మార్గములలో ఎంతో ఉన్నతిని పొందెదరు. ఇది వికసించిన తదుపరి, విధి రీత్యా ఎవరికీ దర్శన భాగ్యమున్నదో వారికి ఆ దర్శనభాగ్యము కలిగిన తదుపరి బ్రహ్మ కమలము అంతర్థానమగును.
బ్రహ్మ కమలములు
నాయనా! శంకరా! నేను దశదిన దీక్షతో తపస్సమాధిలో ఉండదలచితిని. ఆర్తులైన మానవులు ఎవరయినా వచ్చిన యెడల తపస్సమాధికి భంగము కలుగకుండ నీవును, మాధవుడును దర్శనము చేయించవలసినది. పాము కాటుచే చనిపోయిన వారు ఎవరయినా వచ్చిన యెడల స్వామి యోగసమాధిలో ఉన్దేననియు, అందుచేత శాస్త్రప్రకారము చనిపోయినవారి శరీరమును నదీ ప్రవాహములో విడిచివేయుట గాని, లేదా పూడ్చి పెట్టుట గాని చేయవలసినదని నా ఆజ్ఞగా వారికి తెలుపుదు." అని వచించెను.
శ్రీ పళనిస్వామి తన ఆసనమునందే కూర్చుని తపస్సమాదిలోనికి పోయెను. నేనును, మాధవుడును ఆర్తులైన భక్తులు వచ్చినపుడు ప్రశాంతముగా దర్శనము చేయించుచుంటిమి. వచ్చిన భక్తులలో కొందరు మాకు భోజన సంభారములను సమకూర్చిరి. మాధవుడు వంట చేయు ప్రయత్నములో దాపులనున్న కొబ్బరి చెట్టు నుండి మట్ట రాలిపడుటచే అచ్చటకు పోయి ఆ కొబ్బతి మట్టను తెచ్చి వంట ప్రారంభించెదనని పలికెను. నేను వల్లెయుంటిని. మాధవునితో మరియొకడు బయలుదేరెను. విధి వైపరీత్యము! మాధవుడు కొబ్బరి మట్టను ఎత్తబోవునంతలో కొబ్బరి మట్ట చాటున నున్న త్రాచు పాము మాధవుని కరచెను. ముగ్గురు మనుష్యులు పోయి మాధవుని గుహ దరిదాపులకు తీసుకొని వచ్చిరి.
శ్రీ స్వామిది అనుల్లంఘనీయమైన శాసనమగుటచే మాధవుని నేను పాతిపెట్టితిని. ఖనన సందర్భములో నాకు అచ్చట నున్న భక్త జనులు సహకరించిరి. నేను వెక్కి వెక్కి ఏడ్చితిని. మాధవుని నిష్కల్మష హృదయము, వాని నిర్మల భక్తీ, శ్రీపాద శ్రీవల్లభుల యందు వానికి గల అచంచల విశ్వాసము గుర్తుకు వచ్చి నా మనస్సంతయును కకావికలమయ్యెను. విధి అనుల్లంఘనీయమని సరిపెట్టుకొంతిని. ఈ దుస్సంఘటన తరువాత మరియొక దుస్సంఘటన చూచితిని. ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ 18 సంవత్సరముల ప్రాయము గల ఒక యువకుని శరీరమును వాని సంబంధీకులు తీసుకుని వచ్చిరి. అతడు కూడా పాము కాటు చేతనే మరణించెను. శ్రీస్వామి యోగసమాధిలో నున్నారనియు, వారి ఆజ్ఞ ప్రకారము ఖననము చేయవలసినదనియు తెలిపితిని. అచ్చటనున్న భక్తజనులు, యితని సహచరుడు కూడా ఈ విధముగానే మరణించెననియు, శ్రీస్వామి వారి ఆజ్ఞ ప్రకారము వాని ఖననము కూడ జరిగెననియు తెలిపిరి. వారు విషణ్ణవదనులై గత్యంతరము లేక దుర్విధిని పరిపరివిధములుగా నిందించుకొనుచూ ఆ నవయువకుని ఖననము చేసిరి.
ప్రతీరోజూ ముగ్గురో నలుగురో స్వామివారి దర్శనమునకు వచ్చేదివారు. వారు ప్రశాంతముగా సమాధి స్థితిలోనున్న స్వామివారి దర్శనము చేసుకొని వెళ్ళిపోయెడివారు. ఈ విధముగా పదిరోజులు గడచిపోయెను. పదకొండవ రోజున శ్రీ పళనిస్వామిలో చైతన్యము రాసాగెను. బ్రాహ్మీముహూర్త సమయమున శ్రీ స్వామి చైతన్యస్థులై "మాధవా!" అని పిలిచెను. నేను వెక్కి వెక్కి ఏడ్చుచూ జరిగినదంతయూ వివరించితిని.
అప్పుడు స్వామి నన్ను ఓదార్చి, యోగ దృష్టిని నా వైపు ప్రసరింపచేసెను. ఆ యోగ దృష్టికి నా వెనుబాములో ఏదో సంచలనము కలిగి భరించరాని బాధ కలుగ సాగెను. శ్రీ స్వామి తిరిగి ప్రసన్న దృష్టితో నా వైపు చూసిరి. నా బాధ మటుమాయమయ్యెను. "నాయనా! మాధవునకు శ్రీవల్లభుల దర్శన ప్రాప్తి స్థూల శరీరముతో లేదు. వాని సూక్ష్మ శరీరము యీ పదిరోజులనుండి కురువపురములో నున్న శ్రీ చరనుల సన్నిధిలో ఉన్నది. ఏది ఏమయినను వాని కోర్కె తీరెను. శ్రీవల్లభుల లీలలు అనూహ్యములు. కాల కర్మ కారణ రహస్యములు ఎవ్వరునూ గ్రహింపజాలరు. అది శ్రీపాదుల వారికి మాత్రమే సాధ్యము. మాధవుని స్థూల శరీరములోనికి ప్రవేశింపజేయవలసిన బాధ్యతను శ్రీపాదులవారు నాకు అప్పగించిరి. మనము ఆ పనిని సత్వరమే నేరవేర్పవలెను." అని శ్రీ పళనిస్వామి సెలవిచ్చెను.
నాకు ఇంతకు ముందు ఉన్న విచారమంతయును క్షణములో మాయమయ్యెను. మాధవుడు పునరుజ్జీవితుడు అగుట కంటె నాకు కావలసినది ఏమున్నది? మాధవుని పాతిపెట్టిన చోటికి వచ్చితిమి. శవము బైటకు తీయబడినది. నాకు సహాయకులుగా మరి ఇద్దరు ఉండిరి. స్వామి మమ్ములను దక్షిణదిక్కుగా నున్న తాటిచెట్ల గుంపు వద్దకు పోయి, "మాధవుని కరచిన ఓ నాగరాజమా! శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ ప్రకారము నీవు శ్రీపళనిస్వామి సన్నిధికి రావలసినదని ఆజ్ఞాపించడమైనది." అని చెప్పమన్న మేము ఆ విధముగనే చేసితిమి.
శ్రీ పళని స్వామి తన కౌపీనము నుండి నాలుగు చిన్ని గవ్వలను తీసెను. వాటిని శవము యొక్క నాలుగు దిక్కులా వద్ద ఉంచిరి. అవి కొంతసేపటికి కొద్దిపాటి ఎత్తునకు ఎగిరినవి. ఆ పిదప రివ్వుమని ధ్వని చేయుచూ ఆకాశములోనికి నాలుగు దిక్కులలోనికి పోయినవి. మరి కొంతసేపటికి బుసలు కొట్టుచూ వచ్చుచున్న నాగుపామును చూచితిమి. అది ఉత్తరదిక్కు నుండి వచ్చుచుండెను. ఆ పాము చాలా అసహనముగా ఉండెను. శ్రీ పళనిస్వామి యొక్క నాలుగు చిన్ని గవ్వలు దాని పాడగా మీద గ్రుచ్చినట్లుగా అంటుకొనిపోయి ఉండెను. శ్రీ పళనిస్వామి ఆ పామును మాధవుని శరీరము నుండి విషమును తీసివేయమని చెప్పెను. పాము ఎచ్చట కరచినదో అచ్చటి నుండియే విషము గ్రహించబడెను. శ్రీ పళనిస్వామి శ్రీపాద శ్రీవల్లభ నామమును స్మరిస్తూ ఆ పాముపై మంత్రోదకమును చల్లిరి. ఆ పాము పళనిస్వామి పాదములను ముద్దుపెట్టుకొని, శ్రీ స్వామికి ముమ్మారు ప్రక్షినము చేసి ప్రశాంతముగా నిష్క్రమించెను.
దత్తభక్తులకు అన్నము పెట్టుట వలన కలుగు ఫలము
శ్రీ పళనిస్వామి యీ విధముగా సెలవిచ్చిరి. "ఈ పాము గత జన్మము నందు స్త్రీ. ఆమె వృద్ధురాలయ్యెను. ఆమె కొంత పాపమును, కొంత పుణ్యమును చేసి యుండెను. ఒక పర్యాయము దత్త భక్తుడైన ఒక బ్రాహ్మణునకు ఆమె అన్నము పెట్టెను. దత్తుడు చాలా సులభముగా ప్రసంనమగు తత్త్వము గలవాడు. ఈమె మరణించిన తరువాత యమలోకమునకు పోయెను. యమధర్మమునకు పోయెను. యమధర్మరాజు యీమెనిట్లు ప్రశ్నించెను. "నీవు కొంత పాపమును, కొంత పుణ్యమును చేసుకొని యుంటివి. దత్త భక్తుడైన బ్రాహ్మణునకు అన్నము పెట్టుట వలన నీకు మహా ఫలము సిద్ధించినది. శ్రీ దత్తాత్రేయుల వారు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ రూపమున మానవ లోకములో ఉన్నారు. నీ పాపపుణ్యముల ఖాతాలో మార్పు చేయవలసినదియూ, నీకు మహాపుణ్యము కలుగునట్లును, స్వల్పపాపము కలుగునట్లునూ మమ్ములను వారు ఆజ్ఞాపించిరి.. అందుచేత చిత్రగుప్తుల వారు నీ ఖాతాలో మార్పును చేసిరి. నీవు తొలుదొల్తగా పాపమును అనుభవించెదవా? లేక పుణ్యమును అనుభవించెదవా?" దానికి ఆమె స్వల్ప పాపఫలమును అనుభవించి, ఆ తదుపరి పుణ్య ఫలమును అనుభవించెదనని చెప్పినది. అందువలన ఆమె భూలోకములో పాముగా జన్మించినది. ఆమె మనస్తత్వము యితరులకు హాని చేయునది అగుటవలన తనదారికి అడ్డము వచ్చిన వారినందరనూ కరచుచుండెడిది. అందువలన దానికి మరింత పాపఫలము తోడగుచున్నది. నాయనా! సర్పములలో నాలుగు జాతులుండును. మొదటి రకము పాములు ఎవరికి హాని చేయక కేవలము గాలిని ఆహారముగా చేసుకొని యోగుల వలె జీవించును. రెండవ రకము పాములు ఎవరి నీడ అయినా దాని మీద పడిన యెడల క్రోధముతో వారిని చంపివేయును. మూడవ రకము పాములు నరుని కంట పడకుండా ఉండగలందులకు ప్రయత్నించును. ఒకవేళ నరుడు ఎదురయిన యెడల భయముతో పారిపోవును. నాలుగవ రకము పాములు ఎవ్వరునూ తనకు అపకారము చేయకపోయిననూ, నిష్కారణముగా తన కంటపడిన వారిపై పగబట్టి కాటువేయును. ఆ వృద్ధస్త్రీ రజోగుణ పూరితురాలు గనుక తన దాపులకు వచ్చిన మాధవుని కాటు వేసెను. ఆమె పూర్వపుణ్య వశమున మాధవుని కాటి వేసినది. మాధవుడు పూర్వ జన్మములోని పాప వశమున విగతజీవుడయ్యెను. శ్రీపాదుల వారి అనుగ్రహము వలన ఆ వృద్ధ స్త్రీ త్వరలోనే తన నాగ జన్మము నుండి విముక్తురాలై ఉన్నత లోకమును పొందెను. జీవుడు పిండావస్థలో సర్పిలాకారములో ఉండును. నాగదోశము వలన సంతాన నష్టము కలుగును."
sripada srivallabha charitamrutam Telugu chapter - 1 | sripada.co
sripada srivallabha SriPada Srivallabha Charitamrutam Telugusripada srivallabha charitamrutam Telugu chapter -1
శ్రీ రస్తు శుభమస్తు అవిఘ్నమస్తు
శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం
అధ్యయము -1
వ్యా ఘ్రేశ్వర శర్మ వృత్తాంతము
శ్రీ మహాగణాధిపతికి, శ్రీ మహాసరస్వతికి, అస్మద్గురు పరంపరకు,శ్రీ కృష్ణ భగవానునికి , సమస్తమైన దేవీదేవతా గణములకు ప్రణామాంజలులు సమర్పించి శ్రీమదఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీదత్తప్రభువు యొక్క నవావతారణ వైభవమును వర్ణింపదలచినాను.
శ్రీ దత్తప్రభువు అతి ప్రాచీనుడు,నిత్యనూతనుడు,ఈ కలియుగములో శ్రీపాదశ్రీవల్లభస్వామిగా ఆంధ్రదేశము నందలి గోదావరీ ప్రాంత ప్రదేశమయిన శ్రీపీఠికాపురమను గ్రామము నందు అవతరించెను.వారి దివ్య చరిత్రను, దివ్య లీలా వైభవమును వర్ణించుటకు మహా మహా పండితవరేణ్యులకే అసాధ్యమయిన పరిస్థితులలో ఎంత మాత్రము విద్యాగంధము లేని అల్పజ్ఞుడయిన నేను వారి చరిత్రను వర్ణించుటకు పూనుకొనుట కేవలము దివ్యాజ్ఞ ప్రకారమనియు,దివ్యాశీస్సులు వలననియు సర్వజనులకు వినయపూర్వకముగా తెలియజేసుకోనుచున్నాను
![]() |
శ్రీ దత్తప్రభువు |
నా పేరు శంకరభట్టు. కర్ణాటక దేశస్తుడను .సమర్థుడను,భరద్వాజ గోత్రోద్భవుడను,శ్రీకృష్ణభగవానుని దర్శనార్ధము ఉడిపి క్షేత్రమునకు వచ్చితిని బాలకృష్ణుడు నెమలిపించముతో, ముగ్ధమనోహరముగా దర్శనమిచ్చి శ్రీ కన్యకాపరమేశ్వరీ దర్శనార్ధము పోవలసినదని ఆజ్ఞాపించెను.
ఉడిపి బాలకృష్ణుడు
ఉడిపి బాలకృష్ణుడు
నేను శ్రీకన్యకాపరమేశ్వరీ దేవిని దర్శించితిని. సాగరత్రయ సంగమ ప్రదేశమున పుణ్య స్నానములు చేసితిని. ఒకానొక మంగళవారం రోజున శ్రీదేవి దర్శనార్ధము గుడిలో ప్రవేశించితిని పూజారి నిష్ఠగా పూజ చేయుచుండెను . నా చేతిలోని ఎర్రరంగు గల పుష్పములను గ్రహించి అతడు పూజ చేయుచుండెను. అంబ నా వైపు కరుణాపూరిత దృష్టితో చూచుచుండెను ."శంకరా ! నీ హృదయము నందు గల పవిత్ర భక్తికి సంతసించితిని. నీవు కురవపురమునకు పోయి అందు గల శ్రీపాద శ్రీవల్లభస్వామిని దర్శించి జన్మసార్థక్యమును పొందుము. అతడు నా సోదరుడు. మా యిద్దరికీ గల సోదర,సోదరీ బంధము దేశకాలములకు అతీతమైనది. శ్రీపాద దర్శన మాత్రముననే నీ మనస్సునకు,ఆత్మకు,సర్వేంద్రియములకు అనిర్వచనీయమైన అనుభవము కలుగునని " చెప్పెను .
అంబ అనుగ్రహమును పొంది శ్రీ కన్యకాపరమేశ్వరీ పుణ్యధామము నుండి ప్రయాణము సాగించుచు దానికి స్వప్న దూరంలోనే యున్న మరుత్వమలై అనుగ్రామమునకు వచ్చితిని .శ్రీ హనుమంతుడు సంజీవినీ పర్వతమును తిరిగి హిమాలయమునకు తీసుకొని పోవునపుడు దానిలో నుండి ఒక ముక్క జారీ క్రిందపడినదనియు దానిని మరుత్వమలై అని పిలిచెదరనియు తెలుసుకొంటిని .
మరుత్వమలై గ్రామమునందు ఆ కొండ గలదు. చూడచక్కనైన కొండ దానిలో కొన్ని గుహలు కలవు. అది సిద్ధపురుషులు అదృశ్యరూపమున తపస్సు చేయు పర్వతభూమిని తెలిసికొంటిని. నా అదృష్ట రేఖ బాగున్నయెడల ఏ మహా పురుషుడనయినా దర్శింపలేకపోవుదునాయని గుహలను దర్శించుకుంటిని. ఒక గుహ వద్ద మాత్రము ఒక పెద్దపులి ద్వారము వద్ద నిలబడియున్నది .నాకు సర్వాంగముల యందును వణుకు దడ పుట్టినది భయవిహ్వలుడైయిన నేను ఒక్కసారిగా శ్రీపాదా! శ్రీవల్లభా ! దత్తప్రభు !అని బిగ్గరగా అరచితిని. ఆ పెద్దపులి సాధు జంతువు వలే నిశ్చలముగా ఉండెను ఆ గుహ నుండి ఒక వృద్ధ తపస్వి బయటకు వచ్చెను .
ద్వారము వద్ద పెద్దపులి
ద్వారము వద్ద పెద్దపులి
నాయనా ! నీవు ధన్యుడవు మరుత్వమలై ప్రాంతమంతయును శ్రీపాద శ్రీవల్లభ నామమును ప్రతిధ్వనించింది. శ్రీదత్త ప్రభువు యీ కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ నామమున అవతరించెనని,మహాసిద్ధ పురుషులకు,మహాయోగులకు,జ్ఞానులకు ,నిర్వికల్ప సమాధి స్థితి యందుండు పరమహంసలకు మాత్రమే వేద్యము. నీవు అదృష్టవంతుడవు కావున యిచ్చటకు రాగలిగితివి .ఇది తపో భూమి .సిద్ధభూమి .నీ కోరిక సిద్దించును. నీకు తప్పక శ్రీవల్లభుల దర్శనభాగ్యము కలుగును. ఈ గుహ ద్వారమున నున్న యీ పెద్దపులి ఒక జ్ఞాని. ఈ జ్ఞానికి నమస్కరింపుము అని వచించెను .
అంతటా నేను పెద్దపులి రూపములో నున్న ఆ జ్ఞానికి నమస్కరించితిని.ఆ పెద్దపులి వెంటనే ఓంకారమును చేసినది. ఆ ధ్వనికి మొత్తం మరుత్వమలై అంతయును ప్రతిధ్వనించింది. సుశ్రావ్యముగా "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే " అని ఆలాపించినది. నేను యీ వింత దృశ్యమును పరికించుచుంటిని పెద్దపులి యొక్క రూపము నందలి అణువులన్నియును విఘటనము చెంది దాని నుండి కాంతిమయ దివ్యదేహధారి అయిన పురుషుడు అభివ్యక్తమయ్యెను. అతడు వృద్ధ తపస్వికి నమస్కరించి ఆకాశమార్గమున కాంతి దేహముతో ఆ దివ్యపురుషుడు వెడలిపోయెను. నా ఎదుట నున్న వృద్ధ తపస్వి మందహాసము చేసెను. నన్ను గుహలోకి రమ్మని ఆహ్వానించెను. నేను మౌనముగా గుహలోనికి ప్రవేశించితిని .
వృద్ధ తపస్వి నేత్రయుగ్మము నుండి కరుణారసము ప్రవహించుచుండెను. కేవలము తన సంకల్ప ప్రభావముచే అతడు అగ్నిని సృజించెను. ఆ అగ్నిని సృజించెను ఆ దివ్యాగ్నిలో హుతము చేయుటకు కావలిసిన పవిత్ర ద్రవ్యములను,పండ్లను సృజించెను. వైదిక మంత్రోచ్చారణ చేయుచూ అతడు పదార్ధములను ఆ దివ్యాగ్నిలో హుతము చేసెను.
ఆ వృద్ధ తపస్వి యిట్లు వచించెను. "లోకములో యజ్ఞయాగాది సత్కర్మలు అన్నియును లుప్తమయి పోవుచున్నవి. పంచభూతముల వలన లబ్ది పొందిన మానవుడు పంచ భూతాత్మకమైన దైవమును విస్మరించుచున్నాడు. దేవతా ప్రీతికరముగా యజ్ఞములు సలుపవలెను. యజ్ఞముల వలన దేవతలు సంతృష్టి చెందెదరు. వారి అనుగ్రహము వలన ప్రకృతి అనుకూలించును. ప్రకృతిలోని ఏ శక్తి విజృంభించిననూ మానవుడు మనజాలడు. ప్రకృతి శక్తులను శాంతింపచేయకున్న, అరిష్టములు,అనిష్టములు సంభవించును. మానవుడు ధర్మమార్గమున విడనాడిన ప్రకృతి శక్తుల వలన ఉపద్రవములు కలుగుచుండెను. లోకహితార్ధము నేను యి యజ్ఞమును చేసితిని యజనమనగా కలయిక. అదృష్టవశమున నీవు యి యజ్ఞమును చూచితివి. యజ్ఞఫలముగా నీకు శ్రీదత్తావతారులైన శ్రీపాద శ్రీవల్లభ దర్శనము కలుగును. ఇది చాలా అలభ్యయోగము. అనేక జన్మల నుండి చేసుకున్న పుణ్యమంతయునూ ఒక్కసారిగా ఫలితమివ్వనారంభించి యిటివంటి అలభ్యయోగమును కలిగించును" అని వచించెను.
"సిద్ధవరేణ్యా! నేను శ్రీకన్యకాపరమేశ్వరీ మాత దర్శనము చెసుకొన్నపుడు అంబ నన్ను శ్రీపాద శ్రీవల్లభుల దర్శనము కొరకు కురువపురము పొమ్మని చెప్పినది. శ్రీవల్లభులు తమ సోదరులని చెప్పినది. తమ సోదర, సోదరీబంధము కాలాతీతమైనది తెలిపినది. ఇక్కడ తమ దర్శనము, వ్యాఘ్ర రూపములో ఉన్న మహాత్ములు వారి దర్శనము కలిగినది. ఇంతకూ వ్యాఘ్రరూప మహాత్ములు ఎవరు? శ్రీవల్లభుల వారికీ శ్రీ కన్యకాపరమేశ్వరీ దేవి గల సోదర సోదరీ బంధమును కాలాతీతమనుటలో అర్థమేమిటి ? అసలు శ్రీదత్తప్రభువు ఎవరు? ఈ నా సంశయములు ఉత్తర మొసంగి నన్ను ధన్యులు చేయవలసినది " ప్రార్ధించితిని.
ఆ వృద్ధ తపస్వి యిట్లు చెప్పనారంభించెను. నాయనా ! ఆంధ్రదేశము నందు గోదావరి మండలమందు అత్రి మహర్షి తపోభూమిగా ప్రసిద్ధి గాంచిన ఆత్రేయపుర గ్రామము నందు శ్రోత్రియమైన ఆశ్యపసగోత్రము నందు ఒక బ్రాహ్మణుడు జన్మించెను. అతనికి తల్లిదండ్రులు వ్యాఘ్రేశ్వరశర్మ అని నామకరణమును చేసిరి. తండ్రి మహాపండితుడైనను యితడు మాత్రము పరమశుంఠ అయ్యెను. విద్యాభ్యాసము ఎంతకాలము చేసిననూ సంధ్యావందనము కూడా చేయజాలదయ్యెను."వ్యాఘ్రేశ్వరశర్మా అహంభో అభివాదమే"అని మాత్రము అనుచుండెను. తోటివారు పలుకు సూటిపోటి మాటలకు అతడు కలత చెందెను. తల్లిదండ్రుల అనాదరణ కూడా ఎక్కువయ్యెను హిమాలయములందు మహాతపస్వులు ఉందురనియూ,వారి కరుణా కటాక్షముచే ఆత్మజ్ఞానము సిద్ధించుననియూ,అతడు విని యుండెను. తిలదానములు పట్టుటకును,అభావమేర్పడినపుడు ఆబ్దికములకు పోవుట తప్ప ఎవరునూ యితనిని పిలువకపోవుట వలన యీతనిలో ఆత్మన్యూనతా భావమేర్పడెను.
ఒకానొక బ్రహ్మముహూర్తమున అతనికి స్వప్న దర్శనమైనది దానిలో దివ్యమయ కాంతితో విరాజిల్లుచున్న దివ్యశిశువు కన్పించెను.అతడు నభోమండలము నుండి భూమి మీదకి దిగి వచ్చుచుండెను. అతని శ్రీచరణములు భూమిని తాకగానే యీ భూమండలము దివ్యకాంతితో నిండిపోయెను.ఆ దివ్యశిశువు తన వైపునకు నెమ్మదిగా అడుగులు వైచుచూ వచ్చెను."నేనుండగా భయమెందులకు ? ఈ గ్రామమునకు నాకునూ ఋణానుబంధము కలదు.ఋణానుబంధములేనిదే కుక్క అయిననూ మన వద్దకు రాలేదు .నీవు హిమాలయ ప్రాంతమైన బదరీ అరణ్య భూమికి పొమ్ము నీకు శుభమగును అని పలికి అంతర్ధానమయ్యెను.
బదరీ అరణ్య ప్రాంతము
వ్యాఘ్రేశ్వరశర్మ బదరీ అరణ్య ప్రాంతమునకు చేరెను.మార్గమధ్యమున అతనికి అయాచితముగా భోజనము సిద్ధించుచుండెను.అయితే ఆటను బయలుదేరినది మొదలు ఒక కుక్క అతనిని అనుసరించి వచ్చుచుండెను.కుక్కతో పాటు అతడు బదరీ అరణ్యములో సంచరించసాగెను.అతడు తన సంచారములో ఊర్వశీకుండము అనుచోట పుణ్యస్నానము చేసెను.తనతో పాటు ఆ కుక్క కూడా పుణ్యస్నానములు చేసెను.ఒక మహాత్ముడు తన శిష్యులతో ఊర్వశీకుండమునకు పుణ్యస్నానము నిమిత్తము వచ్చెను. ఆ మహాత్ముని పాదపద్మములకు మ్రొక్కి వ్యాఘ్రేశ్వరుడు తనను శిష్యునిగా స్వీకరించవలసినదని ప్రార్ధించెను.ఆ మహాత్ముడు దయతో అంగీకరించెను. ఆ మహాత్ముడు వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించిన తక్షణమే ఆ కుక్క అంతర్ధానమయ్యెను.ఆ మహాత్ముడు యిట్లు వచించెను."వ్యాఘ్రేశ్వరా ! నీతో పాటు వచ్చిన ఆ శునకము నీ యొక్క పుణ్యజన్మార్జితా పుణ్యస్వరూపము.కాలప్రభోధితుడవై నీవు యిచ్చటకు రాగలిగితివి.ఊర్వశీకుండము నందు స్నానమాచరించగలిగితివి.నరనారాయణులు తపోభూమికి ఆకర్షింపబడితివి.ఇదంతయూ శ్రీ పాద శ్రీవల్లభుల అనుగ్రహము సుమీ!" అని పలికెను.
వ్యాఘ్రేశ్వరుని శిష్యునిగా స్వీకరించి
వ్యాఘ్రేశ్వరుడు వినమితాంగుడై "గురుదేవా! శ్రీ పాద శ్రీవల్లభులు ఎవరు ? వారి అనుగ్రహము నా యెందేట్లు కలిగినది?" అని ప్రశ్నించెను నాయనా! వారు సాక్షాత్తూ దత్తప్రభువులు.త్రేతాయుగమునందు భరద్వాజుడను మహర్షి సావిత్రకాఠక చయనము అను గొప్ప యజ్ఞమును శ్రీ పీఠికాపురము నందు నిర్వహించెను.దానికి శివపార్వతులను ఆహ్వానించెను.భరద్వాజునకు యిచ్చిన వరము ప్రకారము భరద్వాజ గోత్రము నందు అనేక మంది మహాత్ములు, సిద్ధపురుషులు,జ్ఞానులు,యోగులు అవతరించునట్లు సావిత్రకాఠక చయనము శ్రీ పీఠికాపురమున జరిగినట్లు పైంగ్య బ్రాహ్మణము నందు చెప్పబడినవి. దేశమునందలి యితర భాగములందు లుప్తమైయినను, కల్కి అవతారభూమి అయిన "శంబల " గ్రామము నందు పైంగ్య బ్రాహ్మణమును, సాంద్ర సింధు వేదమును అతి భద్రముగా కాపాడబడియున్నవి.కలియుగము అంతమై సత్యయుగము వచ్చినపుడు శ్రీ దత్తావతారమూర్తి అయిన శ్రీపాదాసరివల్లభులు శ్రీపీఠికాపురమునకు భౌతికరూపములో వచ్చెదరు. అనేక జన్మములో చేసిన పాపములు క్షీణదశకు వచ్చినపుడు,పుణ్య కర్మలు ఫలితమునివ్వ ప్రారంభించినపుడు మాత్రమే దత్తభక్తి కలుగును. దత్తభక్తిలో పరిపూర్ణత సిద్ధించినపుడు ఏ యుగమందయిననూ, ఏ కాలమునందయిననూ శ్రీపాదశ్రీవల్లభులు భౌతికరూపములో దర్శన,స్పర్శన సంభాషణా భాగ్యము నిచ్చెదరు. నీ పూర్వజన్మ పుణ్యకర్మ బలీయముగా ఉన్న కారణము చేత శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహమునీ పైన కలిగినది. నేను నా గురుదేవులయిన మహావతార బాబాజీ దర్శనార్ధము పోవుచున్నాను తిరిగి సంవత్సర కాలమునకు వచ్చెదను. మీరు, మీకు నిర్ణయించబడిన గుహలలో క్రియాయోగము నభ్యసించుచు,ఆత్మజ్ఞాన సిద్ధికి ప్రయత్నించవలెను అని ఆదేశించి సంజీవినీ పర్వతప్రాంతమైన ద్రోణగిరికి వెడలిపోయెను.
![]() |
మహావతార బాబాజీ |
వ్యాఘ్రేశ్వరశర్మ కూడా తనకు నిర్ణయించబడిన గుహలో కూర్చొనెను. గురుదేవులు బోధించిన క్రియాయోగ పద్ధతులు కానీ, ఆత్మజ్ఞాన ప్రబోధకములయిన మాటలు గాని అతనికి అవగతము కాలేదు. అతడిట్లు ఆలోచించసాగెను. "గురుదేవులు నన్ను ప్రేమతో ఒరే! వ్యాఘ్రమా! అని పిలిచెడివారు. నా యొక్క గురుబంధువులందరునూ వ్యాఘ్రాజినము పై కూర్చొని ధ్యానము చేయుచున్నారు. వ్యాఘ్రచర్మము ఎంతో పవిత్రమైనప్పుడు, యోగికి ఎంతో లాభమును చేకూర్చునది అయినపుడు,వ్యాఘ్రము ఎంత గొప్పది కావలెను? పైగా గురువులు ఆత్మజ్ఞానము కోసము ప్రయత్నించమన్నారు. ఆత్మ అనగా స్వకీయమని గదా అర్ధము. ఇతరులతో నాకేమి పని? నా యొక్క పేరు వ్యాఘ్రేశ్వరుడు. గావున నా యొక్క ఆత్మవ్యాఘ్రమే కావలెను. నేను ధ్యానము చేయవలసినది వ్యాఘ్రమును. అదే నా యొక్క ఆత్మ. నేను వ్యాఘ్ర రూపమును పొందిన యెడల ఆత్మజ్ఞానమును పొందినట్లే " అని తలపోసెను.
సంవత్సర కాలము యిట్టే గడచిపోయెను. గురుదేవులు ప్రతీ గుహ వద్దకు వచ్చి శిష్యులు యోగములో వారు పొందిన అభివృద్ధిని గూర్చి పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుని గుహ వద్ద వ్యాఘ్రేశ్వరుడు లేడు. ఆ గుహలో ఒక వ్యాఘ్రముండెను. శ్రీ గురుదేవులు యోగదృష్టితో పరిశీలించిరి. వ్యాఘ్రేశ్వరుడు తీవ్రముగా వ్యాఘ్రరూపముచే ధ్యానము చేయుట వలన ఆ రూపమును పొందెనని గ్రహించిరి. వాణి నిష్కల్మష హృదయమునకును, ఆత్మశుధ్ధికిని సంతసించిరి. వానిని ఆశీర్వదించి ఓంకారమును నేర్పిరి. "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే " అను దానిని మంత్రముగా వల్లెవేయమనిరి.వ్యాఘ్రేశ్వరుడు తన వ్యాఘ్రరూపములతోనే కురువపుర సమీపమునకు చేరుకొనెను.
కురువపురమునకు చేరుకొనవలెనన్న జలమార్గమున రావలెను. శ్రీవల్లభుల భక్తజనసందోహంతో "నా పరమభక్తుడు నన్ను పిలుచుచున్నాడు. నేను యిప్పుడే తిరిగి వచ్చెదను " అని పలుకుచూ కాంతిమయ శరీరముతో నీటిపై నడవసాగిరి. వారు నడుచునపుడు అడుగుపెట్టబోవు ప్రతీచోట తామరపద్మ ముదాయించుచుండెను. వారు యివలి ఒడ్డునకు రాగానే "శ్రీపాదరాజం శరణం ప్రపద్యే " అని అవిశ్రాంతముగా పఠించుచున్న వ్యాఘ్రేశ్వరుని చూచిరి. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాదశ్రీవల్లభుని దివ్య శ్రీచరణములకు ప్రణమిల్లెను. శ్రీవల్లభులు వ్యాఘ్రముపై అధిరోహించి నీటి మీద తెలియాడుచూ కురవపురమునకు చేరిరి. అందరునూ ఆశ్చర్యచకితులై చూచుచుండిరి.
దత్తపురాణముననుసరించి శ్రీ దత్తాత్రేయుల వారే ధర్మశాస్తాగా అవతరించిరి. ధర్మశాస్త అనగా హరిహరసుతుడైన ఆ ప్రభువు అయ్యప్పస్వామిగా అవతరించినపుడు దేవేంద్రుడు వ్యాఘ్రరూపమును ధరించగా వ్యాఘ్రవాహనారూఢులై రాజధానికి వచ్చిరి. శ్రీవల్లభులు సాక్షాత్తు ధర్మశాస్తయే అని కొందరు భావించిరి. అంబ సింహవాహినియైనట్లే వ్యాఘ్రవాహిని కూడా కనుక శ్రీవల్లభులు జగన్మాత అభిన్నస్వరూపమని కొందరు భావించిరి.
శ్రీవల్లభులు కురువపురం చేరుసరికి,వారు వ్యాఘ్రము నుండి క్రిందకు డిగ్రీ దిగగానే ఆ వ్యాఘ్రము అసువులు బాసినది. దాని నుండి దివ్యమయకాంతితో ఒక మహాపురుషుడు బయల్వెడలెను. తన పూర్వ జన్మ రూపమైన వ్యాఘ్రము యొక్క చర్మమును శ్రీ వల్లభులు తమ ఆసనముగా చేసుకొనవలసినదని ప్రార్ధించెను. దానికి శ్రీచరణములు అంగీకరించిరి. ప్రేమపొంగులు వార శ్రీవల్లభులు యిట్లు సెలవిచ్చిరి. "నాయనా! వ్యాఘ్రేశ్వరురా !నీవు ఒకానొక జన్మమున మహాబలిష్టడవైన పహిల్వానుగా ఉంటివి. ఆ జన్మములో పులులుతో పోరాడుట, వాటిని క్రూరముగా హింసించుట, వాటిని బంధించి,నిరాహారముగా ఉంచి ప్రజల వినొదార్ధము ప్రదర్శనలు యిప్పించుట మొదలయిన క్రూరకర్మలను చేయచుంటినవి. అనుగ్రహము వలన ఈ ఒకే ఒక జన్మలో వ్యాఘ్రరూపమున ఆదుష్కర్మ అంతయును హరించినట్లు చేసితిని. చిరకాలము వ్యాఘ్రరూపమున ఉండుట వలన నీవు కోరుకున్న క్షణమున వ్యాఘ్రరూపము సిద్దించునట్లు వరము నను గ్రహించుచుంటిని. హిమాలయములందు కొన్ని వందల సంవత్సరముల నుండి నా కోసమై తపమాచరించు అనేక మంది సిద్ధపురుషుల దర్శనాశీస్సులను పొందెదవు. యోగమార్గమున నీవు ఉన్నతుడవై ప్రకాశించెదవు గాక! అని ఆశీర్వదించిరి.
నీవు యింతకు పూర్వము చూచినది సాక్షాత్తూ ఆ వ్యాఘ్రేశ్వరూనే. అతడు హిమాలయములందుండును. మహాయోగులు జనసంసర్గము నొల్లరు. అటువంటి వారికి సామాన్య జనుల వలన ఆటంకములు కలుగకుండా యితడు వ్యాఘ్రరూపమున కావలి కాయుచుండును. మహాయోగులు పరస్పరము వర్తమానములను తెలియజేసుకొనుటకు భావప్రసార రూపమున వీలుండును. వారు తమ నెలవుల నుండి బయటకు రావలసిన అవసరము కానీ,వార్తాహరుల అవసరము గాని లేదు. కాని వినోదార్ధము వ్యాఘ్రేశ్వరుని ద్వారా పరస్పరము వార్తలను పంపుకొందురు. యిదంతయునూ శ్రీదత్తప్రభువు లీల .
నాయనా ! శంకరభట్టు! సృష్టికి పూర్వకాలమున ఆదిదంపతులుండిరి. భార్య గర్భవతి అయినపుడు కొన్ని కోరికలుండును. వాటిని తీర్చుట భర్త విధి అని భావించబడుచున్నది. శర్వాణి గర్భమును ధరించినపుడు పరమేశ్వరుడు ఆమెనేదయినా కోరిక కోరుకొమ్మని అడిగెను. అపుడు శర్వాణి, "ప్రభూ ! స్త్రీ శరీరధారినై అన్ని సుఖములను అనుభవించితిని. పురుష శరీరధారిగా ఉన్నప్పటి అనుభవమన్నది ఎలాగున ఉండునో నాకు తెలియదు. కనుక అనుగ్రహించవలసినదీ అని కోరెను. శంకరుడు "తధాస్తు " అనెను. వెంటనే శర్వాణి పురుషరూపము ధరించెను. అదియే మహావిష్ణు స్వరూపము. గర్భస్తుడై ఉన్న శిశువు బయటకు వచ్చు మార్గము లేకుండెను.అపుడు ఆ మహావిష్ణువు యొక్క నాభి యందు కమలము ఉద్భవించెను. ఆ కమలము నుండి బ్రహ్మదేవుడు ఆవిర్భవించి సృష్టి సేయదొడంగెను.
శ్రీ మహావిష్ణువు
శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణీ రూపమును సృజించెను. దైవ రహస్యములు, దైవలీలలు అనూహ్యముగా ఉండును. శ్రీ మహావిష్ణువు, పార్వతీ దేవి యిద్దరునూ యీ విధముగా అన్నా, చెల్లెలు అయి ఉన్నారు.
శ్రీ మహావిష్ణువు
శ్రీ మహావిష్ణువు తన శరీరము నుండి శర్వాణీ రూపమును సృజించెను. దైవ రహస్యములు, దైవలీలలు అనూహ్యముగా ఉండును. శ్రీ మహావిష్ణువు, పార్వతీ దేవి యిద్దరునూ యీ విధముగా అన్నా, చెల్లెలు అయి ఉన్నారు.
ఒకానొక శ్రావణ పూర్ణిమ దినమున పార్వతీదేవి శ్రీమహా విష్ణువునకు రక్షాబంధనమును కట్టెను. "అన్నా! శ్రీభోళాశంకరులు సాధ్యాసాధ్యములు,ఉచితాసుచితములను పరిశీలించకుండా వరములనిచ్చెదరు. అసుర సంహారార్ధము విష్ణుమాయతో నీవు అవతారమును ధరించి నా మాంగల్యమును కాపాడుచున్నావు. అన్నా చెల్లెళ్ళ పవిత్రప్రేమకు నిదర్శనముగా రక్షాబంధనపర్వము వెలయును గాక " అనెను. శ్రీమహావిష్ణువు "తధాస్తు " అనెను.
ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినపుడు మోహినీ అవతారమును ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధముగా ఉండునని ఉహించుటకు వీలు కాదు, మోహినీ శంకరులను జన్మించిన సంతానమే ధర్మశాస్త. ఇతడే కలియుగములో అయ్యప్ప అను అవతారమును ధరించెను. ధర్మశాస్త జననాంతరము మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవరహస్యమున్నది. ధర్మశాస్త ఎవరో కాదు, సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే మహావిష్ణు రూపములో బ్రహ్మ,రుద్రులు కూడా ఏకమవుట వలన దీనిని త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును. పాండ్యభూపాల పుత్రిగా మీనాక్షీ నామముతో పరమేశ్వరి అవతరించినపుడు,పరమేశ్వరుడు సుందరేశ్వరునిగా అవతరించినపుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికినీ వివాహము జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకాపరమేశ్వరిగా అవతరించినపుడు వివాహము జరుగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగములో పీఠికాపురములో ఏ రూపమున అవతరించారో అదే రూపములో దివ్యజ్యోతిర్లోకములలో వారు సృష్ట్యాది నుండియూ ఉన్నారు. వారు 1320 లో శ్రీ పీఠికాపురములో అవతరించి క్రీ ।।శ।।1350 లో కురువపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్యలీలలు సప్తర్షులకే అవగతము కానప్పుడు మనమెంత?" అని వచించెను. అప్పుడు నేను స్వామీ! ఇప్పుడు క్రీ ।।శ।। 1336 నడుచుచున్నది. అయితే శ్రీవల్లభులు కేవలము ఇంక 14 సంవత్సరములు మాత్రమే యీ భూమి పై ఉండెదారా ? ఇంత స్వల్పకాలములోనే అవతార పరిసమాప్తీయా? అని ప్రశ్నించితిని. అప్పుడు సద్గురుదేవులు "నాయనా! శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట. జనన, మరణములు లేనిది వారి లీల దేశకాలా బాధితము.
ఈ వాగ్దానమును అనుసరించే భస్మాసురుని వలన ప్రమాదము ఏర్పడినపుడు మోహినీ అవతారమును ధరించెను. విష్ణుమాయ అచింత్యమైనది. ఈ విధముగా ఉండునని ఉహించుటకు వీలు కాదు, మోహినీ శంకరులను జన్మించిన సంతానమే ధర్మశాస్త. ఇతడే కలియుగములో అయ్యప్ప అను అవతారమును ధరించెను. ధర్మశాస్త జననాంతరము మోహినీదేవి అంతర్ధానమైనది. దీనిలో దైవరహస్యమున్నది. ధర్మశాస్త ఎవరో కాదు, సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే మహావిష్ణు రూపములో బ్రహ్మ,రుద్రులు కూడా ఏకమవుట వలన దీనిని త్రిమూర్త్యాత్మక దత్తాత్రేయముగా కూడా భావించవచ్చును. పాండ్యభూపాల పుత్రిగా మీనాక్షీ నామముతో పరమేశ్వరి అవతరించినపుడు,పరమేశ్వరుడు సుందరేశ్వరునిగా అవతరించినపుడు శ్రీ మహావిష్ణువు వారిద్దరికినీ వివాహము జరిపించెను. అయితే పరమేశ్వరి శ్రీ కన్యకాపరమేశ్వరిగా అవతరించినపుడు వివాహము జరుగలేదు. అయితే శ్రీపాద శ్రీవల్లభులు దేశకాలాతీత అవతారము శ్రీవల్లభులుగా కలియుగములో పీఠికాపురములో ఏ రూపమున అవతరించారో అదే రూపములో దివ్యజ్యోతిర్లోకములలో వారు సృష్ట్యాది నుండియూ ఉన్నారు. వారు 1320 లో శ్రీ పీఠికాపురములో అవతరించి క్రీ ।।శ।।1350 లో కురువపురంలో అంతర్ధానమయ్యే వరకు నడిచే 30 సంవత్సరముల దివ్యలీలలు సప్తర్షులకే అవగతము కానప్పుడు మనమెంత?" అని వచించెను. అప్పుడు నేను స్వామీ! ఇప్పుడు క్రీ ।।శ।। 1336 నడుచుచున్నది. అయితే శ్రీవల్లభులు కేవలము ఇంక 14 సంవత్సరములు మాత్రమే యీ భూమి పై ఉండెదారా ? ఇంత స్వల్పకాలములోనే అవతార పరిసమాప్తీయా? అని ప్రశ్నించితిని. అప్పుడు సద్గురుదేవులు "నాయనా! శ్రీవల్లభులు జన్మించిన గదా తిరోధానమగుట. జనన, మరణములు లేనిది వారి లీల దేశకాలా బాధితము.
కన్యకాపురాణము
శ్రీకృష్ణ పరమాత్మ సమకాలీకుడైన ఉగ్రసేన మహారాజు ఆర్యావర్తమున ఒకరాజ్యమును పరిపాలించుచుండెను. అతడు వైశ్యకులస్థుడు. ఆ మహారాజు యొక్క వంశీకులలో కొందరు దక్షిణ ప్రాంతమున వ్యాపార వ్యవహారములు నడుపుతూ, కొందరు రాజ బంధువుల కుటుంబములతో ఆంధ్రదేశము నందలి బృహత్ శిలానగరము నందుండిరి. బృహత్ శిలానగరమును రాజధానిగా చేసుకుని అగ్రసేన మహారాజు వంశీకుడైన కుసుమ శ్రేష్టియను నతడు ధర్మ పరిపాలన చేయుచుండెను. కుసుమ శ్రేష్టి దంపతులు ధర్మపరాయణులు, సద్వర్తునులు వారు అనేక యజ్ఞయాగాది సత్కర్మలనాచరించుచుండిరి. భాస్కర నామాంకితుడైన రాజగురువు అను మహాత్ముడు శ్రీ కుసుమశ్రేస్థికి అత్యంత హితుడు.
జగన్మాత శ్రీ కన్యకాపరమేశ్వరి నామమున వారి ఇంట జన్మించెను. శ్రీ పాదశ్రీవల్లభులు తమలో నుండి ఒక అంశను తీసి వారి ఇంట జన్మింపచేసెను. అతనికి విరూపాక్షుడను నామకరణము చేయబడెను. రావణుడు ఆత్మలింగమును సాధించుటకై కైలాసవాసుని ప్రసన్నుని గావించుకొనెను. అతడు కోరరాని కోరికను కోరెను. జగన్మాత భద్రకాళి రూపమున వానిని అనుసరించెను. గోకర్ణక్షేత్రమున ఆత్మలింగము భూపతితమై స్థిరపడెను. నాయనా! గోకర్ణ క్షేత్రమునకు, దేవతా రహస్యములతో కూడిన సంబంధమున్నది. రావణ వధ జరిగిననూ,రావణుని యొక్క ఒకానొక అంత కలియుగములో కామమదోన్మత్తుడైన రాజుగా జన్మించెను. అంబ తన భద్రకాళికా రూపమును కలియుగములో వేరుగా ప్రదర్శించినది. ఆమెతో బాటు, రాజకుటుంబములోని బంధువులు కొందరు తమ ఆర్యావర్తభూమి యందలి సంప్రదాయానుసారంగా అగ్నికి ఆహుతి అయి తమ స్వాభిమానమును తెలియజేసిరి. శ్రీ కన్యకాపరమేశ్వరి తన ప్రభువయిన నగరేశ్వరుని చేరుకొన్నది.
అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమ శ్రేష్టి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే వయస్సు (పాలు),పసిడి (బంగారము) శ్రీ కుసుమ శ్రేష్టి స్వీకరించెడివారు. వారికీ "పైండా " గృహ నామమును కలిగినది. "నీవు శ్రీపీఠికాపురము దర్శించినపుడు వారి వంశీకుడైన మహాత్ముని కలిసికొనగలవు. నీవు కురువపురమునకు పొమ్ము. శ్రీ వల్లభుల దర్శనము చేసుకొమ్ము " అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరముతో అంతర్ధానమయిరి.
అంబ జన్మించుటకు ముందు అనేక యజ్ఞములను శ్రీ కుసుమ శ్రేష్టి దంపతులు చేసిరి. వారి రాజబంధువులలో ఒక కుటుంబము వారి నుండి మాత్రమే వయస్సు (పాలు),పసిడి (బంగారము) శ్రీ కుసుమ శ్రేష్టి స్వీకరించెడివారు. వారికీ "పైండా " గృహ నామమును కలిగినది. "నీవు శ్రీపీఠికాపురము దర్శించినపుడు వారి వంశీకుడైన మహాత్ముని కలిసికొనగలవు. నీవు కురువపురమునకు పొమ్ము. శ్రీ వల్లభుల దర్శనము చేసుకొమ్ము " అని ఆశీర్వదించి ఆ సద్గురువరేణ్యులు కాంతిమయ శరీరముతో అంతర్ధానమయిరి.
--------------------శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము --------------------------
Datta | sripada srivallabha charitamrutam|The assurance of Sreepada to His devotees
datta Dattatreya Home sai baba shiridi sai SriPada Charita Videos SriPada Srivallabha Charitamrutam sripada srivallabha charitamrutam free down load sripada srivallabha charitra sripada srivallbha sripada srivallbha charitamrutam audio sripadfa srivallabha charitamrutamThe assurance of Sreepada to His devotees
“As far as My matter was concerned, You could not give Me even the cheap thotakura.If you offered Me meals, you could have earned meritequivalent to feeding lakhs of Brahmins. You lost lot of fortune.Youshould depend upon scriptures when a debate arises as to what is‘dharma’ and what is ‘adharma’. However, when a doubt arises
whether the injunctions of scriptures are to be implemented or not,the decision of pure hearted people is to be regarded as an injunctionof scriptures. Whatever they say is vedic truth and their word isacceptable to the tenets of righteousness. Even if they want topronounce an unrighteous decree, the Goddess of Justice would notallow them to digress into an evil path and compel them to deliver acorrect judgement.
Your scriptures tell that it is sin to harm others. Thebattle that was fought in the presence of Lord Sri Krishna is famous as arighteous battle, the place where the battle between Kauravas and Paandavas took place had become famous as ‘Dharmakshetra’! Religious sacrifice gives punya! but, when the supreme Lord Shiva was not invited, the sacrifice performed by Daksha ultimately became a big battle. The head of Daksha was cut and fell. The head of a goat was fixed for him.
While there is aggravation of bile the physician would treat the patient with lemonand usiri (acid myrobalam). When a part of the body is putrefied, thesurgeon would serve it with a knife and treat it. I am also the same!Features of deities and devils also are within Me. I behave like alunatic, a ghost and also as a devil. Nevertheless, love towards allliving beings would be overflowing within Me. My conduct would be intune with your nature, the good and bad results of your actions. I willnot leave the hands of devotees who rendered total surrender to Me.I will drag My devotees residing in distant lands forcibly to MyKshetra. You should not discuss the origin of sages and rivers.
Has notthe supreme sakthi taken birth as Kanyaka Parameswari in the vysya caste?There are accomplished
siddhas in vysya sages. Not only for brahmin,kshatriya and vysya castes but low caste sudras
also are eligible for vedic upanayanam, if they observe spiritual discipline and regulations! The thirdeye should open up by performance of upanayanam. The inner consciousness should get purified and mind should concentrate on the knowledge ofSupreme. Your mind is completely absorbed in the knowledge of vegetables.Do you think that Brahmam is a commodity to be procured in the market?
Abrahmin in this life may be born as a pariah in the next birth and apariah in this birth may be born as a brahmin in the next birth. Pleasenote that the Supreme Brahmam transcends time and space; caste and religion.
God likes inner feelings and not external appearances. God works according to your feeling.
When matters relating to ‘knowledge ofBrahma’ come up I am a brahmin. When holding court inquiring the welfare of devotees and granting them favours I am a kshatriya.For every living being a wage would be fixed according to his actions of virtue or sin.The wages of every person are with Me. When I weigh and measurefor calculating what is due to every individual, I am a vysya. As serve people by attracting unto My body, the troubles and pains of mydevotees, I am a sudra.
Subscribe to:
Posts (Atom)
Powered by Blogger.
Popular Posts
-
Bootstrap 5 - Blog Cards Home సిద్ధమంగళ స్తోత్రము శ్రీపాద శ్రీ వల్లభ దివ్య సిద్ధ మంగళ స్తోత్రం ...
-
Bootstrap 5 - Blog Cards Home శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తర శతనామావళి Sripada Srivallabha Swamy ...
-
Which result we get offering services to satpurushas,deities and yogis ? By offering services and donations to righteous people and ...
-
Sripada Srivallabha Siddha Mangala Stotram Sripada Srivallabha Divya Siddha Mangala Stotram 1. Srimadanata Sri Vibho...
-
Sripada Rajam Saranam Prapadhye Who is the Protecter of our Life ? In this world many troubl...